సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సంఘీభావం తెలిపేందుకు గత శుక్రవారం సాయంత్రం చంద్రబాబు ను రాజమండ్రి జైలు లో కలవడానికి వస్తున్న నారా లోకేష్ కు సంఘీభావంగా భీమవరం నుండి రాజమండ్రి వెళుతున్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధ సారధి , పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ తదితరులు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారిని ఇళ్ల నుంచి కదలకుండా పోలీసులు వారింట కూర్చుని మఫ్టీ కాసారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్ మోహనరావు ను అడ్డుకుని పోలీసు వాహనంలో తీసుకుని వెళ్లి ఆయనను ఇంటి వద్ద దింపేశారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కనీసం పరామర్శ కు కూడా వెళ్లకుండా నేతలును నిర్బంధించడం వైసిపి సర్కార్ కు పోలీసులకు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
