సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకటి చెడ్డ జరిగితే మాదృచికంగా కొన్ని ఘటనల వల్ల అసలు నిజాలు బయటకు వస్తాయి. .. వివరాలలోకి వెళ్ళితే కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి (18) భీమవరం కు చెందిన యువకుడితో కలిసి వైజాగ్ వచ్చేసింది. ఆమె తల్లి మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో ఆమె కిడ్నప్ అయినట్లు కేసు నమోదు చేసింది. వైజాగ్ వచ్చిన ఆ జంట ఈ నెల 2వ తేదీ నుంచి అప్పి కొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. విశాఖనగర శివారు అప్పి కొండ సాగర తీరం లో మొన్న ఆదివారం సాయంత్రం తీరం వద్ద రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటుండగా అకస్మాత్తుగా ఎత్తు ప్రదేశం నుంచి జారి పడిపోయింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమె మరణించిందని భావించి ఆమెను అక్కడే వదిలేసి యువకుడు పరారయ్యాడు. ఆమె కు మెలుకువ వచ్చేసరికి సముద్ర హోరులో చిమ్మ చీకటి, జన సంచారం లేని ప్రదేశం లో కాళ్ళు రాళ్లమధ్య ఇరుక్కోవడంతో బయటకు రాలేక రాత్రంతా మృత్యువుతో పోరాడింది. గత సోమవారం ఉదయం బీచ్ కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో ఒడ్డుకు తీసుకొచ్చా రు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాధిత అమ్మాయి వద్ద వివరాలు తెలుసుకొని.. బందరులో కిడ్నప్ కేసు నమోదు చేసిన ఆమె తల్లికి పోలీసులు సమాచారమివ్వగా.. ఆమె నేడు మంగళవారం విశాఖ చేరుకొంది. దువ్వా డ పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నా నేపథ్యంలో మరో ట్విస్ట్ జరిగింది. ఆమెను వదిలేసి వెళ్లిన భీమవరం యువకుడికి ప్రమాదం జరిగిందని, అతను కూడా అదే కేజీహెచ్లో ఉన్నట్లు తాజగా తెలియడంతో ఇదేమి ట్విస్ట్ రా? బాబూ.. అంటూ పోలీసులు వారి తల్లితండ్రులకు సమాచారమిచ్చి కేసు విచారిస్తున్నారు.ఇంకా పూర్తీ సమాచారం తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *