సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; రాజమహేంద్రవరంలో స్థానిక రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాకినాడ నాగమల్లి తోటలో నివాసం ఉంటున్న పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి తన కుటుంబ సభ్యులుతో భార్య కూతురు మనవుడు తో కలసి గోదావరిలోకి దూకారు. తమ కుటుంబాన్ని షేక్ సాధికార్ అనే వ్యక్తి తమను చంపుతామని బెదిరిస్తున్నాడని ఒక లేఖలో రాసి స్నేహితులకు వాట్స్ ఆప్ లో పోస్టు చేసారు. ఈ ఘటనలో నూకరాజు మనవడికి ఈత రావడంతో సురక్షితంగా బయటపడగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, సహాయక బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అసిస్టెంట్ ఇంజినీర్ నూకరాజు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనఫై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *