సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మహాన్, పొన్నియన్ సెల్వం సిరీస్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన చియాన్ విక్రమ్ గతంలో చేసి రిలీజ్ కాకుండా ఆగిపోయిన చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో మంచి అంచనాలు ఉన్న సినిమా..”ధ్రువ నక్షత్రం’ క్లాసిక్, విభిన్న మైన పోలీస్ యాక్షన్ ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడం లో దర్శకుడు గౌతమ్ మేనన్ ఎంతటి సమర్ధుడో అందరికి తెలిసిందే.. అతడు విక్రమ్ హీరోగా 2016లో అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్ట్ ‘ధ్రువ నక్షత్రం ’ ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది.రీతూవర్మ, సిమ్రన్, ఐశ్వర్య రాజేశ్, రాధిక, తదితరులు నటించారు. ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తెలుగులో ఇటీవల ‘సీతారామం’ లియో, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలలో నటించానని, అయితే ఇష్టం తో తాను నటుడిని కాలేదని ఆర్ధిక ఇబ్బందులతో రిలీజ్ కాకుండా ఉన్న నా.. ‘ధ్రువ నక్షత్రం ’ కోసమే నేను నటుడిగా మారాను అన్నారు. దక్షిణాదిన ఆయా చిత్రాల్లో యాక్ట్ చేసినందుకుగానూ వచ్చిన పారితోషికాన్ని ఈ సినిమా విడుదల కోసం ఉపయోగించా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *