సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఫై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పలు కేసులు మోపి జైలు పాలు చేసిందని టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గత 38 రోజులుగా విభిన్న రీతులలో నిరసన దీక్షలు ప్రదర్శనలు చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా నేడు,సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో మాజీ MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది బైక్ లపై చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
