సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అంబేద్కర్ సెంటర్ నుండి విజయలక్ష్మి థియేటర్స్ వరకు సుమారు 22 కోట్ల రైల్వే నిధులతో నిర్మించిన భారీ రైల్వే అండర్ టర్నల్ బ్రిడ్జి ని కలుపుతూ విష్ణు కాలేజీ వైపు ( తాడేపల్లి గూడెం వైపు) విశాలమైన రోడ్డు పనులకు కదలిక వచ్చింది. దీనికోసం గత 3 నెలల క్రితం దుర్గాపురం వైపు దశాబ్దాల ఆక్రమణలలో ఉన్న పేదల ఇళ్లు , దుకాణాలు తొలగించి నప్పటికీ అక్కడ మట్టి చదును తప్ప రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఆర్ అండ్ బి అధికారులలో, కాంట్రాక్టర్లు లో కదలిక వచ్చింది. మరల శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఆక్రమణలు తొలగించి చదును చేసిన స్థలం అవతలకు భారీ కరెంట్ సర్వీస్ మర్చి ఇప్పడు రోడ్డు కు మధ్యస్తంగా కనపడుతున్న భారీ సిమెంట్ కరెంట్ స్తంబాలు ను క్రేన్స్ సహాయంతో తొలగింపు పూర్తీ చేస్తున్నారు. ( ఫై ఫొటో లో చూడవచ్చు) ఇక పనిలో పనిగా ఎటువంటి అడ్డంకులు లేకుండా సుమారు 35 కిమీ భీమవరం టూ తాడేపల్లి గూడెం సరికొత్త విశాలమైన రోడ్డు పరి పూర్తీ అయితే అదే ప్రయాణికులకు పెద్ద మేలు .. ఇప్పటికే తాడేపల్లి గూడెం నుండి పిప్పర వరకు రోడ్డు పనులు గత 7నెలలు క్రితమే పూర్తీ చెయ్యడం గమనార్హం.. అక్కడ నుండి పనులు నత్తనడకలో పడ్డాయి. . నిజానికి ఆ రోడ్డు గత 2దశాబ్దాలుగా పాలకులు పట్టించుకోక గతుకులతో పరమ దారుణంగా ఉండేది. దీనిపై ఇటు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అటు మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన కృషి కొంతమేర ఫలించింది. అతి త్వరలో పరిపూర్ణం కావాలని కోరుకొందాం..
