సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా మహోత్సవాలు నేపథ్యంలో నేడు, మంగళవారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు తన భక్తుల కుటుంబాలకు సంరక్షిణి గా వేద మంత్రాలకు ఆరాద్యవతి అయిన శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అభయం ఇస్తూ దర్శనమిచ్చారు. ఆర్ పళని అప్పన్ దంపతుల సౌజన్యంతో ఈ అలంకరణ జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. ఆలయ కళా వేదికపై విశేషంగా కుంకుమ పూజలు జరిగాయి. దేవాలయ ఆవరణలో నేడు పలువురు పండితులతో అత్యంత వైభవంగా వేద సభ నిర్వహించారు. ఆవరణ పందిళ్ళలో ప్రతి సాయంత్రం పలు సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
