సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో ఎన్నికలు మరో 6వారాలలో జరగనున్నాయి. అన్ని పార్టీలుతమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చి విలీనం ఆగిపోయి షాక్ లో ఉన్న వై ఎస్ షర్మిల తెలంగాణ వైసిపిపార్టీ కూడా తాడో పేడో తేలుచుకొంటామని 119 స్థానాలలో తమ అభ్యర్థులను నిలబెడుతున్నామని ప్రకటించి ఇప్పటికి 12 స్థానాలు అభ్యర్థులను సిద్ధం చేసుకొంది. తెలుగు దేశం పార్టీ కూడా 42 స్థానాలలో అభ్యర్థులను సిద్ధం చేసుకొంటుంది.. మరి తెలంగాణాలో బీజేపీ తో పొత్తు లేని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాము 32 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎవరిని ప్రకటించకపోవడం ఎన్నికలలో పోటీ చేసే కార్యాచరణం గాని, పార్టీ మ్యానిపెస్టో విడుదల చెయ్యడం కానీ, పవన్ అడ్జక్షతన సమావేశాలు కానీ జరగక పోవడం తెలంగాణలోని పవన్ అభిమానులను నివ్వెర పరుస్తుంది. గెలుపు ఓటములు దైవదినాలు.. కొన్ని మెరుపులయిన మెరిపించకపోతే ఎలా? అయితే ఈసారి కూడా పవన్, జనసేన అభ్యర్థులు బరిలో నిలవకపోతే తెలంగాణాలో జనసేన పార్టీ ఉనికి ప్రశ్నర్ధకం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *