సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనవిజ్ఞాన వేదిక – ఆం.ప్ర ఈ ఎఐపిఎస్ఎన్ అనుబంధం తో గత 33 సం॥లుగా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్న చెకుముకి సైన్సు సంబరాలు 2023 కు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాలలో నవంబర్ 10న నిర్వహిస్తారు. పలు మండలాలు, పట్టణ స్థాయిలలో ఉన్న పాఠశాలలలో నవంబర్ 30 న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సైన్స్ అధ్యయనం!శాస్త్రీయ ఆలోచన!! శాస్త్రీయ ఆచరణ!!! లక్ష్యంగా జరిగే ఈ ఎగ్జిబిషన్ సంబరాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి లో పెద్ద ఎత్తున వచ్చే డిసెంబర్ 17న నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు : డా॥ ఎం. గేయానంద్, Ex. M.LC, 9490098919 ప్రధాన కార్యదర్శి : కుర్ర రామారావు 9490300442 తెలిపారు. వివరాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులను లేదా స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలను సంప్రదించాలని కోరారు.
