సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ తో పొత్తు ను వ్యతిరేకిస్తున్న జనసేన నేతలను బుజ్జగించే ప్రక్రియా ను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఆయన తాజగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తో జనసేన పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుందని.. తేలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన రెండు నాయకత్వాలు కలసి రాష్ట్ర భవిష్యత్ కోసం ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నామన్నారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ తో పాటు రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని, రెండు పార్టీల కలయిక ద్వారా ఏపీలో ఇంకా మెరుగైన అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కృషిచేస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఉమ్మడి ప్రణాళికతో టీడీపీ, జనసేన ఇంటింటికీ వెళ్ళే కార్యక్రమం చేపడతామన్నారు. కొత్తపేట మండలం అల్లపల్లివారిపాలెం, వానపల్లి గ్రామాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు జనసేన పార్టీ కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద భీమా చెక్కులను నాదెండ్ల మనోహర్ అందజేశారు. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *