సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నేడు, శనివారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జులు, అనుబంధ సంస్థ ప్రతనిధులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఇకపై పార్టీ దిశా నిర్ధేశ్యం తెలుస్తుకోవడానికి మరో 6 నెలలలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ కేంద్ర కార్యాలయం కు చేరుకొన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసిపి పాలనలో టీడీపీ కార్యకర్తలకు నేతలకు రక్షణ లేకుండా పోయిందని తాజగా పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి మంత్రి పెద్ది రెడ్డి అనుచరులు దాడి కి పాల్బడ్డారని ఆరోపిస్తూ ..దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సైకో పాలనలో సైకిల్ త్రొక్కిన తప్పే .. అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.
