సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా దీపావళి పండుగల నేపథ్యంలో భీమవరం పద్మాలయ థియేటర్ సెంటర్ లో జేపీ రోడ్డులో స్పెన్సర్ ఎదురుగా ఉన్న స్థలంలో చేనేత, చేతి వృతుల కళాకారులూ ఏర్పాటు చేసిన.. A 1 క్రాఫ్ట్ బజారు ఎగ్జిబిషన్ ప్రారంభమయింది. ఆహుతులను అలరించే విధంగా భారీగా స్టాల్స్ ను ఏర్పాటు చేసారు. దేశవ్యాప్తంగా చేతివృతుల కళాకారులు తయారు చేసిన సుమారు 5000 రకాలు పైగా విభిన్న ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయని నిర్వాహకులు సిగ్మా న్యూస్ కు తెలిపారు. ఈ స్టాల్స్ లో చేతివృత్తి కళాకారుల నైపుణ్యంకు అద్దంపట్టే చేనేత, అద్దంకి వస్త్రాలు , పంజాబీ దుస్తులు, ఫ్యాన్సీ, మట్టి గాజులు, డోర్ కర్టెన్స్, సోఫా కవర్స్, చెక్క తో చేసిన ఇంటీరియల్ డెకరేషన్స్ , చెక్కతో చేసిన కళాఖండాలు, తివాచీలు, ఫర్నిచర్ ,ఇంటి సామగ్రి, పిండి వంటలు కు ఉపయోగపడే అచ్చులు, గాజులు, పాన్సీ ఐటమ్స్, మట్టి తో చేసిన కుండలు, బాటిల్స్, అలంకరణ వస్తువులు ఇలా ఎన్నో వేల రకాల వస్తువులు A 1క్రాఫ్ట్ బజారులో ప్రదర్శిస్తున్నారు. సందర్శకులు ఉచితముగా వీక్షించే సౌకర్యం తో పాటు వారి వాహనాల పార్కింగ్ కూడా ఉచితంగానే నిర్వాహకులు అందిస్తున్నారు. కాబట్టి పండుగ వేళలలో మన భారతీయత సంప్రదాయం ను ప్రతిబింబించే మనకు పూర్తీ ఆరోగ్యకరమైన ఆ వస్తువులు చూసి ఆనందించడమే కాదు వాటిని కొనుగోలు చేసి కళాకారులను పోత్సహించవలసిన అవసరం ఉంది.
