సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు కి వెళ్ళాక రాజకీయాలలో ఇదే మంచి అవకాశం అని ప్రతిపక్ష పాత్రలోకి పవన్ కళ్యాణ్ దూసుకొనివస్తే బాగుంటుందని జనసేన క్యాడర్ భావించింది. అయితే అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడయితే తెలుగుదేశం పార్టీతో పొత్తును హడావుడిగా రాజమండ్రి జైలు బయట ప్రకటించారో, ఆ క్షణం నుంచి జనసేన క్యాడర్ లో ఒక రకమైన అభద్రతా భావం కనపడమే కాదు పలు చోట్ల బహిర్గతం అయ్యి కొందరు జనసేన నేతలు పార్టీకి దూరంగా జరిగారు. ఇంకా ఎన్నికలకు 6నెలలు సమయం ఉంది.. అప్పటికి ఏమి జరుగుతుంది? జనసేనకు గౌరవ ప్రదంగా కనీసం 40 లేదా 50 స్థానాలు పొత్తులో బాగంగా వస్తాయా? వాటిని నిలబెట్టుకోవడానికి క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్ సిద్ధంగా ఉందా? టీడీపీ నేతలతో ఎంతవరకు సర్దుకుపోవాలి.. చంద్రబాబు అనుభవం మనకు కావాలి అంటూ నాదెండ్ల మనోహర్ క్యాడర్ కు చెప్పుతూ.. తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకనే చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఎన్నికలు వచ్చేసాయి. తెలంగాణలో 32 స్థానాలు జనసేన పోటీ చేస్తుందని ఏకపక్షంగా ప్రకటించిన పవన్ని కిషన్ రెడ్డి లాంటి బీజేపీ పెద్దలు కలసి చర్చలు జరపగానే ఆయన పోటీపై ప్రక్క చూపులు చూస్తున్నారు. ఈ కాలయాపన ఫై తెలంగాణ జనసేన నేతలు నేరుగానే సమావేశంలో పవన్ ను నిలదీశారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో 40 పైగా స్థానాలలో జనసేన అభ్యర్థులు నిలబడి కూడా మీ ఆదేశాల ప్రకారం తప్పుకొన్నారని అవే స్థానాలలో బీజేపీ జనసేన మద్దతుతో గెలిచిందని, తరువాత వారు జనసేన ను పట్టించుకోలేదని , ఈసారి పోటీ చెయ్యకపోతే పార్టీకి భవిషత్తు ఉండదని పవన్ కు ప్రబోధ చేసారు. అయితే పవన్ కోణంలో ఆలోచిస్తే.. తెలంగాణలో ఎన్నికలలో జనసేన 32 చోట్ల గెలవకపోతే ఆ ప్రభావం ఏపీ ఎన్నికల మీద పడుతుంది. తెలుగుదేశంతో సీట్ల బేరం లో డిమాండ్ తగ్గించుకోవాలి .. మరి ఏపీలో బీజేపీ తమ పొత్తుతో కల్సి వస్తుందా?ఇలాంటి గందర గోళం ఉండి ఉంటుంది. ఏదీ ఏమైనా తెలుగు రాష్ట్రాలలో జనాలకు డబ్బు ఇవ్వకపోయినా పవన్ మీటింగ్ కు పెద్ద ఎత్తున వస్తారు. తన మేనియా ను ఓట్ల రూపంలో మార్చుకొనే రాజకీయ ప్యూహం, క్షేత్ర స్థాయిలో గ్రామాల నుండి జనసేన క్యాడర్ బలోపేతం చెయ్యనంత కాలం ఈ సందేహాలు , వెనక అడుగులు తప్పవు... సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *