సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో విషాద ఛాయలు అలముకొన్నాయి. నిన్న సాయంత్రం విహార యాత్రకోసం యానం వచ్చి గోదావరిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం నేడు, ఆదివారం కూడా గాలింపు జరుగుతుంది. అయితే ఇప్పటికి ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం అయ్యాయి, వారంతా తణుకుకు చెందిన బిటెక్ చదువుతున్న వారుకాగా మృతులలో ఒకరు డిగ్రీ 3 వ సంవత్సరం చదువుతున్నారని అధికారులు గుర్తించారు. మునిగిపోయిన సమీపంలోనే ఇద్దరు మృతదేహాలను గత రాత్రే గుర్తించారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరు హనుమకొండ కార్తీక్(21), తిరుమలరావు రవితేజ(21)ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు మూడు బోట్లలో నేడు, ఆదివారం మిగిలిన ఇద్దరు మృతుదేహాలు లభించాయి. దసరా సెలవులు కావడంతో 7గురు స్నేహితులు కల్సి సరదాగా సేదతీరేందుకు యానాం వెళ్లాలనుకున్నారు. అలా మూడు మోటారుసైకిళ్లపై అక్కడకు వెళ్లారు. అక్కడి గోపిలంక పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. సెల్ఫీలు తీసుకొన్నారు. ( ఫై సెల్ఫీ అదే..)భోజనం చేసి సరదాగా కాసేపు స్నానం చేసి సేదతీరుదామనుకున్నారు. వారిలో ఒక యువకుడు గోదావరి లో స్మిమింగ్ చేస్తానంటూ అకస్మాత్తుగా పరిగెట్టుకుంటూ వెళ్లి గోదావరిలోకి దూకాడు. అతడ్ని కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు.. ఇలా మొత్తం నలుగురు యువకులు మునిగి పోయారు. మిగిలిన స్నేహితుల్లో ముగ్గురు నిస్సహాయులుగా మారి ఫై అధికారులకు తెలపడంతో గాలింపు మొదలయింది.
