సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు,ఆదివారం ఎప్పటికైనా చెడు ఫై మంచి గెలుపు కు గుర్తుగా రాక్షస సంహారం పూర్తీ చేస్తున్న శ్రీ మహిషాశుర మర్ధిని అవతారంలో 8 చేతులతో దివ్య ఆయుధాలు ధరించి సింహ వాహనం అధిష్టించిన దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మావూరి సుందర రావు దంపతుల సోజన్యంతో అలంకారం జరిగింది. ఈ దసరా రోజులలో నేడు 8వ రోజు ఆదివారం కూడా కావడంతో భక్తులు పోట్టెత్తిపోయారు. ఉదయం 11 గంటల నుండి దూరప్రాంతాల నుండి వందలాదిగా భక్తులు ఒక్కసారిగా తరలి రావడం తో భారీ క్యూ లైన్ లలో ఉన్న భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొన్నారు. శ్రీ అమ్మవారి సన్నిధి కి హాలు లో లక్ష కుంకుమ పూజ నిర్వహించారు. ఐతే ఆలయ బయట కళావేదిక ఆవరణలో శ్రీ అమ్మవారికి కుంకుమ పూజలు ఏర్పాటు చేసినప్పటికీ శ్రీ అమ్మవారి సన్నిధిలో ప్రముఖుల కోసం ‘లక్ష కుంకుమ అర్చన’ ఏర్పాటు చెయ్యడంతో క్యూ లైన్లో వెళ్లి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకున్నాక మరో మారు ప్రశాంతంగా శ్రీ అమ్మవారి నిలువెత్తు దివ్య స్వరూపం కనులారా వీక్షించాలనుకొనే వేలాది భక్తులకు తీవ్ర నిరాశ కలుగుతుంది. దీనిని అధికారులు ధర్మకర్తల మండలి పరిశీలించాలి. రేపు దసరా ఆఖరి రోజు కావడంతో మరింత మంది భక్తులు తరలి రానున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ కళా వేదికపై భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తో పాటు నేటి సాయంత్రం 4 గంటలకు వీరవల్లి రాంబాబు చే మిమిక్రి మరియు మ్యాజిక్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7గంటల నుండి ‘శ్యాం భక్తి గాన సుధ’ ఏర్పాటు చేసారు. ఈ సాంసృతిక కార్యక్రమాలకు అందరు ఆహ్వానితులే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *