సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం విజయదశమి రోజున భీమవరం బ్రాండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ జన్మదినం కావడంతో దేశవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు చేస్తున్న సందడి అంత ఇంతా కాదు.. ఇక భీమవరం లో అయితే పండుగ వాతావరణమే.. దేవి ఆలయాలలో ప్రభాస్ పేరున ప్రత్యక పూజలు నిర్వహించి.. తదుపరి పట్టణ వీధుల గుండా వందలాది అభిమానుల బైక్ ర్యాలీలు, కేక్ కటింగ్, అన్నసమారాధనలు, పేదలకు బియ్యం పంపిణీలు, రక్తదానాలు ఒకటేమిటి అన్ని రకాల స్వచ్చంద ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టారు. ఇక జేపీ రోడ్డు లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలు అందరిని అలరిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశంలో ప్రపధముగా నిలిచేలా.. భీమవరం ప్రాంతవాసులు ఎక్కువగా నివసించే కూకట్ పల్లి, కైలాపూర్ గ్రౌండ్స్ లో అభిమానులు ఏర్పాటు చేసిన ప్రభాస్ 230 అడుగుల భారీ కటౌట్ సలార్ ‘ సినిమాలోని స్టిల్ తో ఏర్పాటు చెయ్యడం పెద్ద హైలైట్ గా చెప్పుకోవాలి. ఆ కటౌట్ కు క్రేన్ సహాయంతో పాలాభిషేకంతో పాటు.. డ్రోన్లతో పుష్ప వర్షం కురిపించి పెద్ద ఎత్తున అభిమానులు మురిసిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *