సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. కంటకాపల్లి రైల్వేజంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో 100 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేటి సోమవారం ఉదయానికి తుక్కుతుక్కు అయిన బోగీల మధ్య ఇరుకున్న 11 మృతదేహాలను గుర్తించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మృతుల సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో 38 మందికి మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నామని, విశాఖ కేజీహెచ్, ఎన్.ఆర్.ఐ, మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కొక్కరు చొప్పున వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మృతుల పేర్లు పరిశీలిస్తే.. కంచుబారిక రవి, గిరిజాల లక్ష్మి, బలరామ్, అప్పలనాయుడు, కాపు శంభం, చల్ల సతీష్, పెనుమర్రి గౌరినాయుడుతో పాటు పలాస ప్యాసింజర్ రైలు గార్డ్ ఎం.ఎస్.రావు కూడా ఉన్నారు. ఇక రాయగడ రైలు ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మరణించారు.
