సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయెల్ దేశానికీ పాలస్తీనా భూభాగం లో ఉన్న గాజా నగరం లో హమాస్ వర్గం మధ్య జరుగుతోన్న యుద్ధం రోజురోజుకు భీకరం గా మారుతోంది. తమ దేశంపై దాడి చేసి ప్రాణ ఆస్తినష్టం చేసిన హమాస్ ఉగ్రవాదుల ను ఏరివేయడమే లక్ష్యం గా ఇజ్రాయెల్ చేస్తోన్న ప్రతిదాడుల్లో హమాస్ తీవ్ర వాదులతో పాటు నిత్యం వందల మంది అమాయకులు , మహిళలు చిన్నారులు చెయ్యని తప్పుకు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం మొదలైన పక్షం రోజుల్లోనే ఇరువైపుల మరణాల సంఖ్య 10వేలు దాటినట్లు ఒక అంచనా. ఒక్క గాజాలోనే ఈ సంఖ్య 8వేలు దాటింది. యుద్ధగాయలు తట్టుకోలేక సరైన ఆహారం, మంచినీరు లేక చిన్నారులు వారి తల్లితండ్రులు చూస్తుండగానే నిస్సహాయులుగా మరణించడం ప్రపంచం లో మానవత్వం చిరునామాను ప్రశ్నిస్తుంది. ఈ యుద్ధం లో రోజుకు సగటున 400 పైగా మంది చిన్నారులు మరణిస్తున్నారని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇలా వేలమం ది చిన్నా రుల మరణం తో ‘గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక’గా మారిం దని ఐరాస చిన్నారుల విభాగం యునిసెఫ్ (UNICEF) ఆందోళన వ్య క్తం చేసింది. ఇరువర్గాలు మనిషి ప్రాణానికి విలువలేని యుద్ధం ఆపాలి.. ఎవరు చనిపోయిన అది మనిషే .. వారికీ కుటుంబం ఉంటుంది. దేశాలకు, మతాలకు హద్దులుంటాయి.. కానీ దీనంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబం క్షోభ కు హద్దులు ఉండవు మరి..
