సిగ్మా తెలుగు డాట్, ఇన్ , న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలో నేడు, బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. . పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
