సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం చల్లబడింది. చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి.జిల్లా కేంద్రం భీమవరంలో అయితే మధ్యాహ్నం 3గంటల వరకు ఎండలు కాస్తున్న ఆకస్మికంగా గత 5 రోజులుగా ముసురు కమ్మేస్తుంది. సాయంత్రం 5గంటల నుండి చలిగాలులు వీస్తున్నాయి. నేడు గురువారం మద్యాహ్నం 12-30 కే వాతావరణం చల్లబడింది.. అయితే గత బుధవారం సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న మొగళ్తూరు లో భారీ వర్షం కురిసింది. ఏకంగా ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో ఒక్క రోజులో 31.2 మిల్లి మీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. ఇక నరసాపురం 2.0, పాలకొల్లు 1.2 మిల్లి మీటర్లు మేర పరిసరప్రాంతాలలో వర్షాలు నమోదు అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *