సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అక్రమాస్తుల కేసులో తెలంగాణ సీబీఐ కోర్టులో విచారణ తరుచు వాయిదా పడుతుందని ఇది మరో రాష్ట్రానికి బదిలీ చెయ్యాలని నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు వేసిన పిటిషన్ ఫై నేడు, శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై సుప్రీం వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి తో పాటు సీబీఐకి కూడా నోటీసులు ఇచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. అయితే తాజా వార్త సమాచారం ప్రకారం.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్పై కూడా సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఏమిటి? సంబంధమని కోర్టు ప్రశ్నించారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఈయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా? అని కోర్టు అడుగగా.. ఎంపీ రఘురామ కూడా వైసీపీ తరపున గెలచిన ఎంపీనే అని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
