సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో వీవర్స్( చేనేత ) కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కొరకు స్థానిక ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు కేటాయించిన MP నిధులనుండి 23 లక్షల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో పాలకొల్లు టీడీపీ ఎమెల్య నిమ్మల రామానాయుడు నేడు, శుక్రవారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. టిడిపి ఆవిర్భావం నుంచి బీసీలు మరి ముఖ్యంగా చేనేత వర్గాలు అండగా ఉంటున్నారు. వీరి సంక్షేమానికి అభివృద్ధికి టిడిపి ఎల్లప్పుడు కృషి చేస్తుంది. అందుకే టిడిపి అధికారంలో లేకపోయినా, నిధుల పంపిణీకి అవకాశం లేకపోయినా చేనేత వర్గాల పట్ల ఉన్న అభిమానం, ప్రేమ వలనే ఎంపీ రఘురామా కృష్ణంరాజు సహకారంతో నిధులు తెచ్చి చేనేత కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది అని అన్నారు.
