సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; ఒకటిన్నర రోజు సమయం వృధా కాకుండా చాల తక్కువ సమయంలో ‘కాశీ’ వెళ్లాలనుకునే కోస్తా ఆంధ్ర ప్రయాణికులకు శుభవార్త… విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్‌కతాలకు విమాన సర్వీసులు నేడు, గురువారం ప్రారంభమయ్యాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతి వారంలో మూడు రోజులు ఈ సర్వీసులు నడుపుతోంది.. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం వారణాసి, కోల్‌కతాకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ విమానంలో విజయవాడ నుంచి నేరుగా వారణాసికి రెండు గంటల్లో వెళ్లొచ్చు.ఫ్లైట్ నంబర్ 6E 6501విమానం వారణాసి నుంచి బయల్దేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ విమానంలో వారణాసి నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్ నంబర్ 6E 6502 విమానం తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.20 గంటలకు విజయవాడలో బయల్దేరి.. రాత్రి 8.15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. విజయవాడ టు వారణాసి టికెట్‌ ధర దాదాపు రూ.6,500 నుంచి రూ.8 వేల మధ్య ఉంటుందని ఇండిగో సంస్థ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *