సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత సరిహద్దులోని హిమాలయ దేశం నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో శిధిలాల క్రింద సుమారు 200 మంది మృతి చెందినట్లు( అధికారికంగా 163 మంది అని ప్రకటించారు) వేలాది ప్రజలు గాయపడినట్లు భావిస్తున్నారు. నేటి శనివారం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం గత అర్ధరాత్రి 6. 4 తీవ్రత తో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు భారత్ లోని యూపీ , ఢిల్లీ రాష్ట్రాలలో కూడా ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. వాయువ్య నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో మరణించిన వారికీ గాయపడిన కుటుంబాలకు భారత్ ప్రధాని మోడీ తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ నేపాల్ కు ఈ విపత్తు నేపథ్యంలో అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.( update photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *