సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR ఇంజనీరింగ్ కళాశాల లో ప్రముఖ కంపెనీ అయిన నవతా ట్రాన్సుపోర్టు కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నేడు, శనివారం నిర్వహించి ప్లేసెమెంట్ డ్రైవ్ లో 38 మంది ఎంపిక అయినట్లు కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ, కొత్తపల్లి శివ రాజు తెలిపారు. నవతా ట్రాన్సుపోర్టు మంచి మార్కెట్ కల్గిన సంస్థ అని కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇన్తెర్వివ్ లో విజయం సాధించాలని కోరారు. చాలా కంపెనీ లు ఉద్యోగం తో పాటు ఉన్నత విద్యావకాశాలు అందిస్తున్నాయని కావున విద్యార్థులు తమకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ మాట్లాడుతూ .. ఈ ప్రాంగణ ఎంపికలలో 38 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని తెలిపారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టాంగా మారింది.తమ కళాశాల విద్యార్థులకు మంచి మార్కులతో పట్టా ఒక్కటే కాకుండా ‘భావవ్యక్తీకరణ నైపుణ్యాలు’ మరియు ఆధునిక సాఫ్ట్వేర్ల ఫై మంచి అవగాహనా కలిగిస్తున్నట్లు తెలిపారు. ప్లేసెమెంట్ డైరెక్టర్ డా. సిహెచ్.రాంకిషోర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తమ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సుమారు రెండువందలకు పైగా ఉద్యోగాలు కల్పించామని మరియు మిగిలిన విద్యార్థులందరికీ రానున్న ప్రాంగణ నియమాకాలలో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.
