సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 677 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ పోస్టుల్లో 362 సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్పోర్టు (డ్రైవర్) పోస్టులు ఉండగా.. 315 మల్టీ టాస్కింగ్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. పదో తరగతి కోర్సులు చేసినవారు ఈ ఉద్యో గాలకు అర్హులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు నవంబర్ 13న రాత్రి 11.59 గంటల వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయో పరిమితి: సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు ఉంది. వేతనం : సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్పోర్టు పోస్టులకు రూ.21,700-రూ.69,100, మల్టీ టాస్కింగ్స్ పోస్టులకు రూ.18వేలు నుంచి రూ.56,900 అక్టోబర్ 14 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.500 (పరీక్ష ఫీజు రూ.50, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జి రూ.450). ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూ డీ/మహిళా అభ్యర్థులకు రూ.450 (పరీక్ష ఫీజు మినహాయిం పు) ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి,, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , విజయనగరం కేటాయించారు.
