సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూరగాయల ధరలు ఉల్లిపాయ, టమాటాలతో సహా మరోసారి ఊపువచ్చి కేజీ కి వచ్చి సెంచరీ రేట్లకు పరిగెడుతుంటే, దొండకాయ ధర మాత్రం దారుణంగా పడిపోతుంది. రైతుకు మధ్యవర్తులు చెల్లించే ధర కేజీకి 3 రూపాయలు మించడం లేదు దానితో దొండ రైతులు ఆందోళన చెందుతున్నారు, రిటైల్ మార్కెట్ లో మాత్రం 20 నుండి 25 రూ ధరకు అమ్ముతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పరిసర ప్రాంత గ్రామాలు పెరవలి, ఉండ్రాజవరం , తదితర గ్రామాలతో పాటు కొవ్వూరు, నిడదవోలు , పరిసర ప్రాంతాలలో దొండ పాదులుతో కాయలు పండించే పండ్ల రైతులు తాజా పరిస్థితి కి నివ్వెరపోతూ పంట కోసే కూలి ,మార్కెట్కు తరలించే ఖర్చులు కుడా రాక అలాగే పాదులకు కాయలు వదిలేస్తున్నారు. అయితే దొండపాదు ఒక్కసారి వేస్తె వరుసగా 4 ఏళ్ళు పెద్ద పెట్టుబడి లేకుండా పంట ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది, కార్తీక మాసానికి అయినా రేట్లు పెరగకపోతాయా ? అని చిరు ఆశ మాత్రం మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *