సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళంలోను , చక్కటి తెలుగు మాట్లాడుతూ ఇక్కడ తెలుగులోనూ సినీ హీరోగా రాణిస్తున్న కార్తీ నటించిన ‘జపాన్’ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి రాజు మురుగన్ దర్శకుడు, ఎంతటి హీరోతో చేసినాసరే ప్లాప్ సినిమా ల హీరోయిన్ గా ముద్ర పడిన ‘అను ఇమ్మాన్యుయేల్’ , సునీల్, విజయ్ మేల్తన్ నటించిన ఈ సినిమా కధ ఎలా ఉందంటే.. హైదరాబాదులో రాయల్ బంగారం షాపులో రూ.200 కోట్ల విలువలైన బంగారు నగలు, ఆభరణాలు రోబరి తో సినిమా ప్రారంభం అవుతుంది. . పోలీసులు ఈ దొంగతనం జపాన్ (కార్తీ) అనే దొంగ చేశాడని అనుమానిస్తారు. ఇనస్పెక్టర్ శ్రీధర్ (సునీల్), ఇంకో పోలీస్ ఆఫీసర్ భవాని (విజయ్ మిల్టన్) ఈ ఇద్దరూ ప్రత్యేక టీములతో జపాన్ కోసం వేట మొదలు పెడతారు. జపాన్ కోసం కేరళ, కర్ణాటక పోలీసులు కూడా పట్టుకోవాలని వెతుకుతూ వుంటారు. జపాన్ తను దోచుకున్న బంగారం, డబ్బుతో తనే కథానాయకుడిగా, అందులో సంజు (అనూ ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి వరుస సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి స్టార్ కూడా అయిపోతుంది, అన్ని రాష్ట్రాల పోలీసులు జపాన్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆ దొంగతనం తను చెయ్యలేదు అని చెప్తాడు జపాన్ అదే ట్విస్ట్.. మరి ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ కొందరు పోలీసులు జపాన్ అంటే ఎందుకు భయపడతారు? అన్నది మిగతా కధ .. ఇక కార్తీ సినిమా చివర వరకు ఒకేరకమైన అరవ యాసతో స్వంతంగా డబ్బింగ్ చెప్పి జపాన్ పాత్రను . ఒక పక్క కామిడి బఫున్ గాను మరోప్రక్క సమర్థుడుగాను విభిన్నంగా నటించాడు. సునీల్ కూడా పర్వాలేదు. పాటలు పెద్ద బాగోలేదు. కధాగమనం కాస్త ఆరవ సినిమా వాసనలతో విసుగు కలిగిస్తుంది. మొత్తానికి జపాన్ ప్రేక్షకుల అంచనాల స్థాయిలో లేదనిపిస్తుంది.
