సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ పోస్టల్ శాఖలో భారీ వేతనంతో పలు ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఇంటర్, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద 1,899పోస్టుల భర్తీకి నేడు, గురువారం నోటిఫికేషన్ విడుదల చేసారు. పలు స్పోర్ట్స్ అంశాలలో ఉత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన అభ్యర్థులు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాన్ , మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎం టీఎస్) ఉద్యోగాలకు రేపటి శుక్రవారం (నవంబర్ 10) నుంచి డిసెంబర్ 9వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాల్లో పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు 598 ఉండగా.. సార్టింగ్ అసిస్టెంట్ 143, పోస్ట్ మ్యాన్ 585, మెయిల్ గార్డ్ 3, మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) 570 చొప్పున ఉద్యో గాలు భర్తీ చేస్తారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల్ని ఎడిట్ చేసుకొనే వెసులుబాటు ఉంది. దరఖాస్తు ఫీజు .. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100 కాగా; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూ ఎస్/మహిళలుకు ఉచితం.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఏపీలో 27 పోస్టల్ అసిస్టెంట్, 2 సార్టిం గ్ అసిస్టెం ట్, 15 పోస్ట్ మాన్, 17 ఎం టీఎస్ పోస్టులు భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 16 పోస్టల్ అసిస్టెంట్, 5 సార్టింగ్ అసిస్టెంట్, 20 పోస్టుమ్యాన్, 2 మెయిల్గార్డు, 16 ఎం టీఎస్ ఉద్యో గాలు ఉన్నాయి. వేతనం స్కేలు 25,500 నుండి రూ.81,100గా నిర్ణయించారు. పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 27ఏళ్లుగా నిర్ణయించారు. కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి.
