సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విధులను సక్రమంగా నిర్వహించని ప్రభుత్వ వైద్యులను , బయట ప్రవేటు ఆసుపత్రులకు వెళుతూ సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ హాస్పటల్స్ కు దూరంగా ఉండటం కానీ, అనధికారంగా విధులకు గైర్హాజరీ అయిన వైద్యుల ను తొలగించి కూటమి సర్కార్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. తాజగా 70 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించింది. ఇదే రీతిగా వ్యవహరిస్తున్న మరో 193 మందిపై చర్యలు తీసుకోనుందని.. వారికీ నోటీసులు ఇచ్చి అందుకు సంబంధించిన చర్యలు కసరత్తు జరుగుతుందని తాజా సమాచారం.. ఆ జాబితాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను నేడు, శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు డీఎస్‌హెచ్, డీఎంఈ అధికారులు అందజేశారు.
