సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ ప్రపంచంలో ధర్మం మాత్రమే గొప్పది అని చాటిచెప్పిన ప్రభువు శ్రీరాముని కృపతో .. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తీ కావస్తున్నా నేపథ్యంలో దీపావళి సంబరం ఈసారి నభూతో నభవిష్యతి అనే రీతిలో దీపోత్సవ్ జరిపేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యా నగరం ముస్తాబైంది. దీపావళికి ఒకరోజు ముందే ఏటా సరయూ నది తీరాన నిర్వహించే ‘దీపోత్సవ్’ కార్యక్రమం నేడు శనివారం సాయంత్రం 6న్నర గంటలకు మొదలయింది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు హాజరై, డ్రోన్ కెమెరాలతో దీపాలను లెక్కించారు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి ఇవ్వగానే 25 వేల మంది వాలంటీర్లు 24 లక్షల దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలురాగ, 50 దేశాలకు చెందిన హైకమిషనర్లు, రాయబారులు కు ఆహ్వానం పలకడం విశేషం..
