సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం బ్రాండ్.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ పెం.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సలార్: సీజ్ ఫైర్’. . యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. సినిమా మంచి హిట్ టాక్ వస్తే సంక్రాంతి పండుగ కలెక్షన్స్ అదనపు బోనస్..మరో బాహుబలి అయిపోతుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి ఆదివారం ఉదయం ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 1వ తేదీ రాత్రి 7.19 గంటలకు ‘సలార్’ చిత్రం ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రం ఐమాక్స్ వెర్షనలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
