సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో తాజగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం .. వేర్వేరు ప్రాంతాల్లోని పంటకాలువల్లో వృద్ధులైన ఇద్దరి మహిళల మృతదేహాలు లభ్యమయ్యా యి. మొగల్తూరు మండలంలోని వారతిప్ప కాలువలో గత సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించగా, స్థానికులు మొగల్తూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ నెల 10వ తేదీన భీమవరం పట్టణానికి చెందిన కడలి శశిరేఖ (90) ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారతిప్పలో లభ్యమైన మృతదేహం శశిరేఖదిగా గుర్తించినట్లు ఇన్చార్జి ఎస్సై గురవయ్య తెలిపారు. పాలకొల్లు సమీపంలోని పెదమామిడిపల్లిలోని పంటబోదెలో నరసాపురం మండలం మల్లవరం లంకకు చెందిన దిడ్ల కమల (60) మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నా ఆమె మృతదేహం లభ్యం కావడం గమనార్హం.. రెండు రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె బంధువులు నరసాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహం లభ్యమైన విషయాన్ని కుమారులకు తెలియజేయడంతో వారు వచ్చి తల్లి మృతదేహాన్ని గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *