సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఇటీవల వరుస క్యాంపస్ జాబ్ సెలెక్షన్స్ లో దూసుకొనిపోతున్న స్థానిక DNR ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ కంపెనీ విప్రో కావాసాకి కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ఈ నెల 17, 18 తేదిల్లో (నేడు, శనివారం0 నిర్వహించిన ప్లేసెమెంట్ డ్రైవ్ లో 34 ఇంజినీరింగ్ మరియు 12 పాలిటెక్నిక్ విద్యార్థులు ఎంపిక అయినట్లు కళాశాల సెక్రటరీ, గాదిరాజు సత్యానారాయణ రాజు బాబు తెలిపారు. విప్రో కావాసాకి అంతర్జాతీయంగా హైడ్రోలిక్ యంత్రాల పరికరాలు ను చేసే మంచి మార్కెట్ కల్గిన భహుళ జాతి సంస్థ అని అన్నారు. విజయం సాధించిన 46 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు.అసిస్టెంట్ సెక్రటరీ కొత్తపల్లి శివరామరాజు ఎంపికైనా విద్యార్దులకు శుభాకాంక్షలు తెలిపారు,కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ , ప్లేసెమెంట్ డైరెక్టర్ డా. సిహెచ్.రాంకిషోర్ తదితర అధ్యాపక సిబ్బంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
