సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పంచారామంలో నేడు, ఆదివారం భక్తులు ఉదయం నుండి వేలాదిగా దూరప్రాంతాల నుండి తరలివస్తుండం తో ఆలయ పరిసరాలు భక్తులతో పోట్టెత్తిపోయాయి. గత శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు రవితేజ తో కల్సి పంచారామక్షేత్రంలోని అన్నపూర్ణమ్మ అమ్మవారికి శనివారం మొక్కుబడిలో భాగంగా 100 క్వింటాళ్ల సోనా మైసూర్ బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో 2004 నుండి 2009 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా పని చేసిన తరువాత ప్రభుత్వం తనకు ఇచ్చే పెన్షన్ లక్ష రూపాయలకు తోడుగా తమ కుటుంబ సభ్యులు అందరు మరొక లక్ష వేసుకుని అన్నపూర్ణమ్మ దేవికి ప్రతి ఏటా బియ్యం రూపంలో మొక్కుబడి చెల్లించు కోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. కార్తీక మాసం శివునికి, అన్నపూర్ణ అమ్మవారికి ఇష్టమైన మాసమని, ఈ మాసంలో తన మొక్కు తీర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని .. ఆ మహాదేవుడు ఆశీస్సులు వల్ల కార్తీక మాసం నెలరోజులు కూడా భక్తులకు నిత్య అన్నదానం చేయాలని, ఇందుకు సంబంధించి 100 క్వింటాళ్ల బియ్యాన్ని ముందుగా ఇస్తున్నామని, అవసరమైతే ఇంకా కూడా బియ్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కార్తీకమాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు నాచు శ్రీవల్లి, చెల్లబోయిన సూర్య ప్రకాష్, కూర్మాదాసు సత్య శ్రీనివాస్, నల్లం రఘు, కోయ తాతాజీ, లక్కు త్రిమూర్తులు, వైసీపీ నేతలు కోడే యుగంధర్, నందమూరి ఆంజనేయులు, నల్లం రాంబాబు ,మానేపల్లి నాగన్న బాబు, తదితరులు పాల్గొన్నారు.
