సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. పిచ్ స్వభావం బట్టి ఆస్ట్రేలియా తొలుత టాస్ గెలచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం తో 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు వేగంగా చెయ్యడం విరాట్ కోహ్లీ (54), కేెఎల్ రాహుల్ (66) హాఫ్ సెంచరీలతో ఈ మాత్రం గౌరవ స్కోర్ చెయ్యడం సాధ్యమయింది. ఆస్టేలియా ఫిల్డర్స్ తమ సత్తా చూపారు. గ్రౌండ్ పెద్దది కావడం పిచ్ స్వభావం రీత్యా బ్యాట్ మెన్ కొట్టిన బాల్ వేగంగా బౌండరీ లకు చేరుకోలేకపోయాయి. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆరంభంలోనే బ్యాటింగ్ తడబడ్డారు. ప్రారంభ 2వ ఓవర్లోనే షమీ చేతిలో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. తాజా సమాచారం..ఆస్ట్రేలియా 15 ఓవర్లు కు 77 పరుగులుతో 3 వికెట్స్ కోల్పోయింది.ఈ ప్రతిష్టాకర ఫైనల్ మ్యాచ్ చూడటానికి దేశ విదేశాల నుండి లక్షలాది క్రీడాభిమానులు చేరుకొన్నారు.
