సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఉపందుకొంది. నేతల విమర్శలలో వాడి వేడి పెరిగింది. తాజగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన విమర్శలు చేసారు. ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తెలంగాణలో ఎవరికీ మంచి చేసాడు. తన కుటుంబానికి కీలక 5పదవులు ఇచ్చారు. మరి ఎవరికీ ఉద్యోగాలు ఇచ్చాడు.. నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికో ఉద్యోగం ఏమైంది? రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్ తో ఆర్ధికంగా ఉన్నతంగా ఉన్న తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబానిది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళది కబ్జాలఆరాటం .. బీజేపీ ది పేదల పోరాటం అని ఏపీ తరహాలో డైలాగ్ పేల్చారు.. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో నెంబర్ వన్ అని, ఇటీవల బియ్యం టెండర్లలో రూ.1300 కోట్ల గోల్ మాల్ చేసారని బండి విమర్శించారు.
