సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమిక అంచనా. గత రాత్రి 12 గంటలు సమయంలో జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలు న్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. నేటి సోమవారం ఉదయం ప్రమాద ఘటన కారణాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఒక బోటుపై, పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తూ, వారికి కావాల్సిన వంటకాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఆ పార్టీలో సముద్రం ఫై వీడియోలు తీసే ప్రముఖ యూట్యూబర్ కూడా పాల్గొన్నట్లు ? భావిస్తున్నారు. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *