సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానవత్వం సిగ్గుపడేలా హమాస్ ఇజ్రాయిల్ ప్రజలపై ఉగ్రవాదుల దాడులు, కిడ్నపులు.. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాపై యుద్ధం కొనసాగిస్తూ ఉగ్రవాదులతో పాటు అనేక మంది అమాయకులను మిసైల్ బాంబుదాడులతో మట్టు బెడుతున్న దృశ్యాలు చూస్తూ మానవత్వం అలసిపోతుంది. అటు గాజా కానీ ఇటు ఇజ్రాయిల్ దేశస్తులు, అభం శుభం తెలియని పసివారు కానీ సుమారు 20వేలు పైగా మరణించినట్లు అనధికార అంచనా.. గాయాలు పాలయినవారు అవయవాలు కోల్పోయినవారు, కుటుంబాలు విచ్చినం అయిన వారు ఎంతమందో అంతులేదు. శుభ పరిణామం..తాజా సమాచారం ప్రకారం .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నేపథ్యంలో రెండింటి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియా నుంచివెలువడిన ప్రకటనలే ఇందుకు నిదర్శనం .ఉత్తర గాజాలో ఆసుపత్రులను హమాస్ తమ స్థావరాలుగా ఉపయోగించు కుంటోందని ఆరోపిస్తోన్న ఇజ్రాయెల్ ఇంకా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. ఈ సమయంలో హమాస్ అధిపతి స్పందించారు. ‘ఇజ్రాయెల్తో సంధికి చేరువవుతున్నాం ’ అని సోషల్ మీడియాలో తాజగా పోస్టు పెట్టారు. భారత్ తాజాగా ఈ శాంతి ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేసింది. ఐరాసలో భారత్ స్వాగతించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని వ్య తిరేకిస్తుం దని తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి, శాంతియుత పరిస్థితులు నెలకొనే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. అలాగే బందీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *