సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి.యన్.ఆర్ కళాశాలలో జరిగిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పురుషుల బాడ్మెంటన్ మరియు రోప్ స్కిప్పింగ్( పురుషుల మరియ మహిళల) విభాగాలలో జరిగిన పోటీలలో పురుషుల రోప్ స్కిప్పింగ్ ఛాఫియన్ షిప్ డి.యన్.ఆర్ కళాశాల, మహిళల విభాగంలో ఎ.యస్.డి మహిళల గవర్నమెంట్ కళాశాల , కాకినాడ, బాడ్మెంటన్ పురుషుల టోర్నమెంట్ లో సర్.సి.ఆర్.ఆర్ కళాశాల ఏలూరు విన్నర్స్ గాను, గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల రాజమహేద్రవరం వారు రన్నర్స్ గాను, తృతీయ స్ధానంలో కె.జి.ఆర్.యల్ కళాశాల, భీమవరం వారు కైవసం చేసుకున్నరని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంత కుమారి తెలిపారు. కళాశాలలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో DNR కళాశాల పాలకవర్గ అద్యాక్షులు, గోకరాజు వెంకటనరసింహరాజు, కార్యదర్శి మరియు కరస్పాండెంట్, గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ జి.పాండురంగరాజు, అసిస్టెంట్ సెక్రటరీ, కె.శివరామరాజు, సంయుక్త కార్యదర్సి కె.రామకృష్ణంరాజు, గవర్నింగు బాడీ సభ్యులు, వివిధ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతులు గెలుచుకున్న టీం లను అభినందించారు
