సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సైబర్ టెకనాలజీ గురించి అంతో ఇంతో అవగాహన ఉన్న యువత, ఉద్యోగులు కూడా ఎక్కువగా సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ యువకుడు సైబర్ మోసానికి గురిఅయ్యాడు అన్న విషయం వెలుగులోకి వచ్చింది.పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బు ఇస్తామని ఆ యువకుడికి సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. దీంతో ఆ యువకుడు విడతలవారీగా రూ.89,17,003 వాళ్లు ఇచ్చిన అకౌంట్‌కు ట్రాన్సఫర్ చేశాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఆధార్ బయోమెట్రిక్‌ని లాక్ చేస్తే.. ఆధార్ కార్డ్ హోల్డర్ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ముఖ గుర్తింపు డేటాతో సహా వ్యక్తిగత, బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా భద్ర పరుచుకొంటే ఇటువంటి మోసాల నుండి బయటపడే అవకాశం ఉంది.
