సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఫిబ్రవరిలో అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి వివిధ జిల్లాల్లో 5 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు. మరో 9 పరిశ్రమలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. మరో 5 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ దాదాపు రూ.1100 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 21,744 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ‘‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దాదాపుగా 386 ఒప్పందాలు చేసుకున్నాం. తద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 6 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ముందడుగు వేస్తున్నాం అని ప్రకటించారు. . ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 130 భారీ, అతిభారీ, మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసి 69 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని . వీటి ద్వారా దాదాపు 86 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం’’ అని సీఎం జగన్ ప్రకటించారు.
