సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం అమరావతి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, భీమవరం నుండి కొటికలపూడి గోవిందరావు, కనకరాజు సూరి, మళ్లినీడి బాబీ తదితర రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు. పవన్ ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్చించారు. జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ…‘వైసీపీ పార్టీకి భావజాలం లేదని .. వైసీపీ నేతలను నన్ను.. తెలంగాణాలో ఒకరకంగా ఏపీలో మరో రకంగా బీజేపీ, టీడీపీతో ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు. అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను. జనసేనకు యువతే పెద్ద బలం. రాష్ట్రంలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉంది. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. ప్రజల కోసం మన స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. హైదరాబాద్ లో యువత ఓటింగ్ కు ఆసక్తి చూపలేదు,, అక్కడ 50 శాతం ఓటింగ్ కష్టం అయ్యింది. ఏపీలో మాత్రం యువత ఎన్నికలపై ఆసక్తి చూపి ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
