సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొనివస్తున్న ‘మిచాంగ్‘ తుఫాను ఎల్లుండి సోమవారం డిసెంబర్ 4 న సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా ఇప్పటికే తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. నేటి శనివారం ఉదయం అల్పపీడనంగా కేంద్రీకృతమై చెన్నైకి ఆగ్నేయ నుంచి 790 కి.మీ దూరంలో ఉంది. తాజాగా వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని.. ఇది రేపటి తీవ్ర వాయుగుండంగా మారి పెనుగాలులతో తుఫానుగా తీవ్రమవుతుంది. మచిలీపట్టణం పశ్చిమ గోదావరి తీరప్రాంతానికి కలిసే ఉంది కాబ్బటి, పశ్చిమ గోదావరి జిల్లాలోని అధికారులు అలర్ట్ అవుతున్నారు. భీమవరం, నర్సాపురం సముద్ర తీరప్రాంతాలలో ప్రజలు అలర్టుగా ఉండాలి . మత్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *