సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో నేడు, సోమవారం భీమవరంలో భారీ వర్షం కురుస్తూనే ఉంది. నిన్న అదివారం ఉదయం నుండి పెనుగాలులు, వర్షపు జల్లులు 48గంటల పాటు పడుతూనే ఉన్నాయి. చలిగాలులు తీవ్రత, మబ్బులతో వాతావరణం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.నేటి సోమవారం మధ్యాహ్నం 12న్నర నుండి గంట పాటు కుంభవృష్టి కురిసింది. దానితో పల్లపు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లపై సైతం నీరు చేరింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే వాతావరణం ఉన్నపటికీ తీరప్రాంతం ఉన్న నరసాపురం, భీమవరంలపై ఎక్కువ ప్రభావం కనపడుతుంది. సముద్రం ఆల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుత వాయుగుండం ప్రభావం తుఫాన్‌గా మారే అవకాశం ఉండటంతో పేరుపాలెం సముద్రంలో అలలు ఉవెత్తున లెగుస్తున్నాయి. కలెక్టర్ పి ప్రశాంతి పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్య సంస్థలను మూసివేశారు. రేపు మచిలీపట్టణం- నెల్లూరు వద్ద తీరం దాటే అవకాశం ఉన్న దృష్ట్యా రేపు కూడా విద్య సంస్థలను మూసివేసే అవకాశం ఉంది. ఇక భీమవరం, నరసాపురం తీరప్రాంత గ్రామాలలోని వృద్ధులు, చిన్నపిల్లల్ని తుఫాన్‌ భవనా ల్లోకి మార్చాలని..మత్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని.. రెవెన్యూ సిబ్బందికి అదేశాలు జారీ చేశారు. అధికారులతో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో అంబరీష్‌ సమీక్ష నిర్వహించారు. తీరా గ్రామాల్లో తగిన సహాయ సిబ్బందిని మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *