సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో జనతా గ్యా రేజ్ తర్వాత వస్తున్న సినిమా దేవర.. తరువాత దేశవ్యాప్తంగా పెరిగిన ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. హిందీ హీరో సైఫ్ అలీఖాన్ దీనిలో ప్రధాన విలన్ గా నటిస్తుండడం విశేషం రిలీజ్ డేట్ ని లాక్ చేసిన తర్వాత దేవరా సినిమా .. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూడట్లేదు. దేవర నాన్ స్టాప్ షూటింగ్ లో ఇప్పటివరకూ యాక్షన్ ను ఎక్కువ భాగం షూట్ చేసారు. అయితే ఇప్పటి వరకు దేవర నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను ఈ నెల చివరి వారం క్రిస్మస్ సందర్భముగా విడుదల చేస్తారని సమాచారం.. హిందీలో ప్రఖ్యాత నిర్మాణసంస్థ.. యాష్ రాజ్ ఫిల్మ్స్ వారి ‘వార్ 2 ‘సినిమా షూటింగ్ లో ఇప్పటికే హీరో హుత్రిక్ రోషన్ పాల్గొంటున్నారు. దేవరా షూటింగ్ లో తన పార్టీ పూర్తీ అయ్యాక జనవరి 3వ వారం నుండి యంగ్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ బరిలోకి దిగుతున్నారని సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *