సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తమిళనాడు తో పాటు తెలుగులో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించిన సీనియర్ హీరో మరియు డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్‌ చాల కాలంగా అస్వస్తులు గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్ళీ పూర్తీ విషమయం గా మారిందని తాజా సమాచారం. దీంతో ఆయనకు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. గత నవంబరు 18వ తేదీన ఆయన అస్వస్థతకు గురికావడంతో స్థానిక రామాపురంలోని మియాట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. గత నెల 29వ తేదీన ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. ్ఞఅప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న శనివారం నుండి మళ్లీ శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో ఆయనను కాపాడటానికి వైద్యులు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు, విశేషంగా ఆయన అభిమానులు , డీఎండీకే వర్గాలు ఆసుపత్రి వద్దకు చేరుకొంటున్నారు. ఆయన యాక్షన్ హీరోగా పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్, సిందూర పువ్వు, సిటీ పోలీస్, వంటి ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి.తమిళ రాజకీయాల్లో ఆయన పెను సంచలనం.. గత 2014 లో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు 29 స్థానాలలో గెలచి ఉప ముఖ్యమంత్రి పదవిని కాదని డీఎండీకే పార్టీ అధినేతగా ఆయన తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష నేతగా కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *