సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశములో .. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కోటికల పూడి గోవిందరావు మాట్లాడుతూ.. నేడు సోమవారం విశాఖ పట్నంలోని టైకూన్ జంక్షన్ ను తెరవాలని మూసివేత వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందుపడుతున్నారని నిరసన తెలిపినందుకు మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ ని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడం దారుణం అని ..వెంటనే ఆ జంక్షన్ ను తెరచి ప్రజలకు అందుబాటులో కి తీసుకురాని పక్షంలో ‘ఛలో వైజాగ్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో PAC సభ్యులు కనకరాజు సూరి, పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్,పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకర రవి,, పుప్పాల బాలాజి, మోకా శ్రీనివాస్, బండి రమేష్, త్రివిక్రమ్,తదితరులు పాల్గొన్నారు.
