సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు నాట ఇప్పటికి అగ్రహీరోలతో ఒకరిగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ జన్మదినం నేడు… డిసెంబర్ 13.. ‘కలియుగ పాండవులు’ సినిమాతో అరంగేట్రం చేసిన వెంకీ.. ఆ తర్వాత అన్ని రకాల పాత్రలతో ఆడియెన్స్‌ని అలరించి.. తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు. సినీహీరోగా 35 ఏళ్లు గా స్టార్ డం కొనసాగిస్తూ.. కేవలం 75 సినిమాలు మాత్రమే నటించిన అందులో విజయాలు మాత్రం 90 శాతం.. ఇంత రికార్స్ స్థాయి విజయాలు ఇండియాలో ఏ హీరోకి లేవు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో ఫ్యాక్షన్‌ని పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరోలంతా ఫ్యాక్షన్‌పై పడ్డారు. అలాగే ఫ్యామిలీ, లవ్, కామెడీ.. ఇలా ఏదైనా సరే.. విక్టరీ మార్క్ పడాల్సిందే. పబ్లిసిటీకి , విజయోత్సవాలుకు , అభిమానులకు దూరంగా ఉంటాడు వెంకటేష్..నిజానికి ఏ తెలుగు హీరో సాధించలేని వరుస ఘన విజయాలు వెంకీ సొంతం.. బ్రహ్మపుత్రుడు, బొబ్బిలిరాజా, చంటి , ప్రేమించుకుందాం రా .. కలిసుందాం రా .. లక్ష్మి.. తులసి, ఎఫ్ 2.. ఇలా ఒకటా రెండా ఎన్నో తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఘనవిజయాలు… ఇక హిందీలో కూడా అన్నారి ( తెలుగులో చంటి)సినిమాతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రింద నమోదు చేసాడు. అపట్లో ఆ సినిమా నార్త్ ఇండియాలో 15 కేంద్రాలు లో 175 రోజులు ప్రదర్శింపబడింది. సూపర్ స్టార్ కృష్ణ’ తరువాత తెలుగులో మహేష్ బాబు మొదలుకొని పలువురు హీరోలతో మల్టీస్టార్ ట్రెండ్ కి ‘పెద్దోడు, గా అంకురార్పణ చేసింది వెంకటేష్ మాత్రమే.. ఎటువంటి కాంట్రవర్సీ దరిచేరనీయకుండా.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి అభిమానులు అభిమానించే వెంకీ మామగా ముద్ర వేయించుకున్నారు. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సంక్రాంతి కానుకగా వస్తున్నా,‘సైంధవ్’ .విజయవంతం కావాలని కోరుకొంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..
