సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. పండుగలు వస్తున్నాయి. పండుగలకు కొత్త బంగారు నగలతో సందడి చేద్దామనుకొంటున్న మగువుల ఆశలను తుంచేస్తూ ఊహించని రీతిలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాలలో నేడు, శుక్రవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.62,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,650గా ఉంది. గత గురువారం చూసుకొంటే 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 గా ఉండగా.. ఇవాళ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెరిగింది. అయితే ఇవాళ వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబయి, కోల్ కతాల్లో కిలో వెండి ధర రూ.79,500గా ఉంది.
